విజయ్ ఫ్యాన్స్ కి నిరాశ

- Advertisement -
Leo

తమిళ సూపర్ స్టార్ విజయ్ కి తమిళనాడులో సమస్యలు మొదలవుతున్నాయి. విజయ్ త్వరలో పార్టీ పెట్టబోతున్నారు అనేది టాక్. అందుకే, రాజకీయ పార్టీలు ఆయన్ని టార్గెట్ చేశాయి అంటున్నాయి. ఇలాంటి ప్రచారం జరుగుతున్న టైంలోనే “లియో” సినిమా ఆడియో ఈవెంట్ ని నిర్మాత రద్దు చేశారు.

“లియో సినిమాకి ఆడియో ఈవెంట్ నిర్వహించబోవడం లేదు. దీనికి ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవు. ఆడియో ఈవెంట్ బదులు ఇక నిత్యం మంచి అప్డేట్స్ ఇస్తాం,” అంటూ నిర్మాణ సంస్థ ప్రకటించింది.

ఐతే, తమిళనాడు ప్రభుత్వం కావాలనే విజయ్ నటించిన సినిమా ఆడియో ఈవెంట్ కి పర్మిషన్ ఇవ్వలేదని, అందుకే నిర్మాత ఈవెంట్ ని క్యాన్సిల్ చేశారని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.

లోకేష్ కనగరాజు తీసిన “లియో” అక్టోబర్ 19న విడుదల కానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దర్శకుడు లోకేష్ తీసిన “విక్రమ్” తమిళనాడులో కొత్త రికార్డులు నెలకొల్పింది. అందుకే, “లియో” సినిమాపై విజయ్ అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. కానీ ఇలాంటి అడ్డంకులతో వాళ్ళు తెగ ఫీల్ అవుతున్నారు.

మరోవైపు, ఈ సినిమా ఒక హాలీవుడ్ చిత్రానికి కాపీ అనే ప్రచారం మొదలైంది. “ఏ హిస్టరీ అఫ్ వయలెన్స్” (A History of Violence, 2005) సినిమా కథని కాపీ కొట్టి లోకేష్ తనదైన శైలిలో తీస్తున్నారు అని అంటున్నారు. ఈ హాలీవుడ్ చిత్రం ఆధారంగా తెలుగులో జగపతి బాబు హీరోగా “గాయం 2” అనే మూవీ కూడా వచ్చింది.

 

More

Related Stories