అది ఫేక్ ‘మాస్టర్’ పోస్టర్

Master fake poster

ప్రస్తుతం ఓటీటీకి సంబంధించి చాలా పుకార్లు నడుస్తున్నాయి. ఓ సినిమా డైరక్ట్ ఓటీటీ రిలీజ్ అంటూ కన్ ఫర్మ్ చేయగానే.. ఇతర సినిమాలపై కూడా డైరక్ట్ ఓటీటీ రిలీజ్ అంటూ ప్రచారం మొదలుపెడుతున్నారు. అందులో లాజిక్ ఎంత అనేది కూడా చూడడం లేదు. కోలీవుడ్  లో విజయ్ సినిమాపై ఇలాంటి ప్రచారమే మొదలైంది.

రీసెంట్ గా సూర్య తన కొత్త సినిమాను డైరక్ట్ ఓటీటీ రిలీజ్ కు ఇచ్చేశాడు. దీంతో విజయ్ హీరోగా నటిస్తున్న “మాస్టర్” అనే సినిమా కూడా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అవుతుందంటూ కోలీవుడ్ లో ప్రచారం మొదలైంది. కొంతమందైతే మరో అడుగు ముందుకేసి, నవంబర్ 14న “మాస్టర్” సినిమా వరల్డ్ డిజిటల్ ప్రీమియర్ అంటూ పోస్టర్లేశారు.

కోలీవుడ్ లో అత్యథిక వసూళ్లు సాధిస్తున్న హీరో విజయ్. ఇంకా చెప్పాలంటే రజనీకాంత్, అజిత్, సూర్య సినిమాల కంటే ఈమధ్య విజయ్ సినిమాలకే వసూళ్లు ఎక్కువ. రీసెంట్ గా తన ప్రతి సినిమాతో వంద కోట్ల వసూళ్లు సాధిస్తున్నాడు విజయ్. ఇలాంటి హీరో సినిమా నేరుగా ఓటీటీలోకి వస్తుందనడం అబద్ధం. ఇదే విషయాన్ని యూనిట్ స్పష్టంచేసింది.

థియేటర్లు ఎప్పుడు తెరిస్తే అప్పుడే మాస్టర్ రిలీజ్ అవుతుంది. ఆ తర్వాతే ఓటీటీలో విడుదల

Related Stories