క్షమాపణ చెప్పిన విజయ్ సేతుపతి

Vijay Sethupathi

ఈ రోజు విజయ్ సేతుపతి పుట్టినరోజు. బర్త్ డే నాడు వివాదంలో ఇరుక్కున్నాడు విజయ్ సేతుపతి. “సైరా”, “మాస్టర్” వంటి సినిమాల్లో నటించిన విజయ్ సేతుపతి తన బర్త్ డే సంబరాల్లో భాగంగా ఖడ్గంతో కేక్ కట్ చేశాడు. అది పెద్ద వివాదంగా మారింది.

జనరల్ గా ఎవరైనా కేక్ ని చిన్న స్టీల్ కత్తితోనో, ప్లాస్టిక్ కత్తితోనే కట్ చేస్తారు. కానీ విజయ్ సేతుపతి ఒక పెద్ద తల్వార్ లాంటి ఖడ్గంతో కేక్ కట్ చేసిన ఫోటో వైరల్ కావడంతో క్షమాపణలు చెప్పాడు.

“నేను ఒక సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాను. ఆ సినిమాలో ఈ స్వోర్డ్ కి ప్రాధాన్యం ఉంది. దాంతో, యూనిట్ సభ్యులు ఇచ్చిన ఆ స్వోర్డ్ (ఖడ్గం)తోనే కేక్ కట్ చేశా. కానీ నన్ను చూసి యువతీయువకులు కూడా ఫాలో అయ్యే అవకాశం ఉందన్న అభిప్రాయాన్ని అంగీకరిస్తున్నా ఇకపై ఇలాంటివి జరగకుండా చూసుకుంటాను. క్షమించండి,” అంటూ విజయ్ సేతుపతి ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.

విజయ్ సేతుపతి ఇప్పుడు పెద్ద స్టార్ గా మారడంతో అతని వేసే ప్రతి అడుగుపై ఫోకస్ పడింది.

More

Related Stories