ఆమెతో అలా చెయ్యలేను: సేతుపతి

- Advertisement -
Vijay Sethupathi and Krithi Shetty

విలక్షణమైన నటనతో దేశమంతా పాపులర్ అయ్యారు తమిళ నటుడు విజయ్ సేతుపతి. ‘జవాన్’ చిత్రంతో బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా పరిచయం అయ్యారు. ఇక మన తెలుగులోనూ “ఉప్పెన”, “సైరా” చిత్రాలు చేశారు. ప్రస్తుతం విలన్ వేషాలు పోషిస్తున్నారు కానీ ఆయన బేసికల్ గా హీరో. తమిళంలో ఇప్పటికీ హీరోగా సినిమాలు అడపదడపా చేస్తూనే ఉన్నారు. తాజాగా ఆయన ఒక విచిత్రమైన పరిస్థితి ఎదురుకున్నారు.

తమిళంలో విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో ఒక సినిమా రూపొందుతోంది. ఆ సినిమా దర్శకుడు కృతి శెట్టిని హీరోయిన్ గా తీసుకుందామని భావించారు. అదే విషయం సేతుపతికి చెప్తే ఆయన అస్సలు ఒప్పుకోలేదంట.

“ఉప్పెన” చిత్రంలో కృతి శెట్టి విజయ్ సేతుపతి కూతురిగా నటించింది. ఆ సినిమా సమయంలోనే ఆమెని తన కూతురిలాగా భావించారట. “నా కొడుకు కూడా ఆ అమ్మాయి వయసువాడే. అందుకే, ఆమెని నేను కూతురిలా ట్రీట్ చేశాను. సో, నేను ఆమెతో అలా రొమాంటిక్ గా నటించలేను,” అని ఆ దర్శక, నిర్మాతలకు చెప్పారట.

మనవరాలుగా, కూతురిగా, చెల్లెలుగా నటించిన వాళ్ళతో కూడా వాళ్ళు పెద్దయ్యాక వారికి రొమాంటిక్ జోడిగా నటించిన హీరోలు చాలామందే ఉన్నారు. కానీ, విజయ్ సేతుపతి మాత్రం ఒప్పుకోలేదు.

 

More

Related Stories