క్లారిటీ ఇచ్చిన విజయ్ సేతుపతి!

Vijay Sethupathi


అల్లు అర్జున్ హీరోగా ‘పుష్ప’ తీయాలనుకున్నప్పుడు దర్శకుడు సుకుమార్ మొదట అనుకున్న నటుడి పేరు విజయ్ సేతుపతి. ఈ సినిమాలో పోలీసు ఆఫీసర్ పాత్రని విజయ్ సేతుపతిని దృష్టిలో పెట్టుకొని రాశారు సుకుమార్. కానీ, ఇతర సినిమాలతో బిజీగా ఉన్న విజయ్ సేతుపతి ఒప్పుకోలేదు. దాంతో, మలయాళ హీరో ఫహద్ ఫాజిల్ ని తీసుకున్నారు.

ఇప్పుడు ‘పుష్ప 2’ మొదలవుతోంది. మళ్ళీ విజయ్ సేతుపతి పేరు వినిపిస్తోంది.

ఐతే, విజయ్ సేతుపతి టీం క్లారిటీ ఇచ్చింది. బాలీవుడ్ లో షారుక్ ఖాన్ హీరోగా రూపొందుతోన్న ‘జవాన్’ చిత్రం మినహా ఇంకో పెద్ద సినిమా ఏది ఒప్పుకోలేదనేది ఆ టీం మాట. ‘పుష్ప 2’లో నటించడం లేదని ఖరాకండీగా తేల్చి చెప్పారు.

మరోవైపు, దర్శకుడు సుకుమార్ ప్రస్తుతం ‘పుష్ప 2’ సినిమా మ్యూజిక్ సిట్టింగ్లో ఉన్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే సెప్టెంబర్ నుంచి కానీ, అక్టోబర్ నుంచి కానీ షూటింగ్ మొదలు కావొచ్చు.

Advertisement
 

More

Related Stories