విజయ్ సేతుపతి విచిత్రమైన మాట

Vijay Sethupathhi in Uppena

తమిళ స్టార్ విజయ్ సేతుపతి దర్శకుడు సుకుమార్ కి ఒక రిక్వెస్ట్ చేశాడు. “సార్… మీ సినిమాలో ఒక్క ఛాన్స్ ఇవ్వండి. మీ సినిమాలకు అభిమానిని.” – ఇది విజయ్ సేతుపతి అన్న మాట. “ఉప్పెన” ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో స్టేజ్ పై సేతుపతి అని కోరడం…అందరూ చప్పట్లు కొట్టడం జరిగింది.

కానీ విచిత్రం ఏంటంటే… అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ ప్రస్తుతం తీస్తున్న “పుష్ప” సినిమాలో విలన్ పాత్రకు మొదట అడిగింది విజయ్ సేతుపతినే. విజయ్ సేతుపతి మొదట ఒప్పుకొని ఆ తర్వాత తప్పుకున్నాడు. ‘పుష్ప’కి నో చెప్పి తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా రూపొందుతోన్న ‘మాస్టర్’ సినిమాలో విలన్ గా నటించాడు. డేట్స్ లేవని చెప్పి విజయ్ సేతుపతి ‘పుష్ప’ నుంచి తప్పుకున్నాడు.

సుకుమార్ తన సినిమాలో నటించమని కోరితే…నో చెప్పి… ఇప్పుడు “ఒక్క ఛాన్స్ ఇవ్వండి” అని అడుగుతుండడం విచిత్రం.

More

Related Stories