సేతుపతి బరువు పెరిగాడని వద్దన్నారట

Vijay Sethupathi

విజయ్ సేతుపతి తమ సినిమాల్లో ఒక చిన్న పాత్రైనా చెయ్యాలని దర్శక, నిర్మాతలు కోరుకుంటున్నారు. ‘మాస్టర్’, ‘ఉప్పెన’ సినిమాల్లో సేతుపతి హైలైట్ అయిన తీరు చెప్తోంది…అతనికిప్పుడు ఉన్న క్రేజ్ ఏంటో. పెరఫార్మాన్స్ అలా ఉంటుంది మరి. ఐతే, అలాంటి హీరోని అమీర్ ఖాన్ తన సినిమా నుంచి తప్పుకునేలా చేశాడు.

అమీర్ ఖాన్ ప్రస్తుతం ‘లాల్ సింగ్ చద్దా’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా హాలీవుడ్ క్లాసిక్ ‘ఫారెస్ట్ గంప్’కి రీమేక్. కథ ప్రకారం, హీరో మన దేశంలో జరిగిన కీలకమైన అన్ని సంఘటనల్లో పాల్గొంటాడు. రకరకాల పాత్రలు ఉంటాయి. అందులో ఒక కీలకమైన పాత్రకి విజయ్ సేతుపతిని తీసుకున్నారు. ఐతే, సేతుపతి తనే ఈ మూవీ నుంచి తప్పుకుంటున్నట్లు కొన్నాళ్ల క్రితం చెప్పాడు. డేట్స్ కుదరక చేయట్లేదని వివరణ ఇచ్చాడు.

ఆమీర్ ఖాన్ సినిమాలో ఛాన్స్ వస్తే జనరల్ గా ఎవరూ వదులుకోరు. అందుకే, అసలు కారణం ఏమై ఉంటుందా అని బాలీవుడ్ మీడియా ఆరా తీసింది. ఆ మీడియా కథనాల ప్రకారం… సేతుపతి రీసెంట్ గా బరువు పెరిగాడని, ఆ పాత్రకి అతనిప్పుడు సూట్ కాడని అమీర్ ఖాన్ తేల్చాడట. దాంతో దర్శకుడు ఇదే విషయాన్నీ సేతుపతికి చెప్పాడట. సో, సేతుపతి స్వచ్చందంగా తప్పుకున్నాడని సమాచారం.

అమీర్ ఖాన్, ఆదిత్య చోప్రా వంటి బాలీవుడ్ ఫిలిం మేకర్స్ ‘బరువు’ విషయంలో స్ట్రిక్ట్ గా ఉంటారు. పాత్రకు తగ్గ ఫిజిక్ ఉండాలనే పట్టుబట్టే తత్త్వం వారిది.

More

Related Stories