తమిళ సూపర్ స్టార్ విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారు. ఆయన త్వరలో పార్టీ పెట్టనున్నారు. విజయ్ రాజకీయ అరంగేట్రం గురించి చాలా కాలంగా చర్చ జరుగుతోంది. ఐతే తాజాగా రజినీకాంత్ ఈ విషయాన్ని బహిరంగంగా ప్రకటించారు.
విజయ్ కి, తనకు మధ్య ఎలాంటి విబేధాలు లేవని చెప్తూ రజినీకాంత్ అనేక విషయాలు మాట్లాడారు. విజయ్ తన కళ్ళముందే పెరిగి పెద్దవాడు అయి ఈ రోజు పెద్ద స్టార్ అయ్యాడన్నారు. అలాగే త్వరలో రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న విజయ్ కి విజయం దక్కాలని ఆకాంక్షించారు.
సో, విజయ్ పార్టీ ప్రకటన ఇక కేవలం లాంఛనమే.
విజయ్ కిప్పుడు 49 ఏళ్ళు. హీరోగా నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. తమిళనాడులో ప్రస్తుతం రజినీకాంత్ కన్నా ఎక్కువ పాపులారిటీ ఉన్న హీరో అతను.
ఇక జయలలిత మరణం తర్వాత తమిళనాడు రాజకీయాల్లో బలమైన రాజకీయ శక్తి లేదిప్పుడు. అధికార డీఎంకే పార్టీ హవా ముందు అన్నాడీఎంకే పార్టీ నిలబడలేకపోతోంది. మరోవైపు బీజేపీ తమిళనాడులో పాగా వెయ్యాలని ప్రయత్నిస్తోంది. ఇదే రాజకీయ ఎంట్రీకి సరైన సమయం అని విజయ్ భావిస్తున్నట్లు విశ్లేషకుల మాట.