మాస్టర్ కాంబినేషన్ మళ్ళీ సెట్టయింది!

Master


విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో వచ్చిన ‘మాస్టర్’ బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపింది. కరోనా కాలంలో విడుదలైన ఈ మూవీ తమిళనాడులో బాగా ఆడింది. ఈ ఏడాది ‘మాస్టర్’ తప్ప మరో హిట్ లేదు తమిళ చిత్రసీమకి. అందుకే, విజయ్ మరోసారి ఆ దర్శకుడితో చేతులు కలుపుతున్నాడు.

విజయ్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ అనే యువ దర్శకుడు కొత్త సినిమా తీస్తున్నాడు. ఇది విజయ్ ఖాతాలో 65వ చిత్రం. ఇక 66వ చిత్రాన్ని తీసే బాధ్యతని లోకేష్ కనగరాజ్ కి ఇచ్చాడట. లోకేష్ స్పీడ్ గా సినిమాలు తీస్తాడు. ‘మాస్టర్’ సినిమాలో హీరోయిజమ్ తప్ప కథలో దమ్ము లేదని విమర్శకులు అన్నారు. ఈసారి అలాంటి తప్పు చేయకుండా చూసుకుంటాడట.

లోకేష్ ఇప్పటికే తన గురువు కమల్ హాసన్ తో ‘విక్రమ్’ అనే సినిమా తీసే పనిలో ఉన్నాడు. తమిళనాడు ఎన్నికలు ముగిసిన వెంటనే షూటింగ్ ప్రారంభం అవుతుంది అని టాక్. కమల్ సినిమాని నాలుగు నెలల్లో పూర్తి చేసి వెంటనే విజయ్ సినిమా స్టార్ట్ చేస్తాడట. మొత్తానికి విజయ్ వరుసగా యువ దర్శకులతోనే సినిమాలు చెయ్యాలిని ఫిక్స్ అయ్యాడు. మురుగదాస్ వంటి ఐడియాస్ ఆగిపోయిన దర్శకులకి ఇక దూరంగా ఉంటాడట.

More

Related Stories