
ఇది బయోపిక్స్ ల కాలం. స్ఫూర్తివంతమైన వారి జీవితాలతో రూపొందిన చిత్రాలు బాగా విజయం సాధిస్తున్నాయి. ఇటీవలే ‘ఆకాశం నీ హద్దురా’, ‘రాకేట్రీ’ వంటి చిత్రాల విజయాలు చూశాం. ఇప్పుడు మరో బయోఫిక్ వస్తోంది. ఒక సామాన్యుడు పెద్ద లాజిస్టిక్ కంపెనీకి అధినేతగా ఎదిగి, ఎందరికో స్ఫూర్తినిచ్చిన డా.ఆనంద్ శంకేశ్వర్ జీవితం ఆధారంగా సినిమా రూపొందుతోంది.
‘విజయానంద్’ అనే పేరుతో దీన్ని తెరకెక్కిస్తున్నారు. భారతదేశంలో అతి పెద్ద లాజిస్టిక్ కంపెనీల్లో ఒకటైన వీఆర్ఎల్ కి ఆయన అధినేత.
వి.ఆర్.ఎల్ ఫిల్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌తో సినీ రంగంలోకి అడుగు పెడుతున్నారు ఆయన. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ మలయాళ భాషల్లో సినిమాను ప్రేక్షకులకు అందించటానికి సన్నాహాలు చేస్తున్నారు.
రిషికా శర్మ దర్శకత్వంలో ఆనంద్ శంకేశ్వర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను మంగళవారం విడుదల చేశారు. విజయ్ శంకేశ్వర్ పాత్రలో నిహాల్ నటించారు. ఆనంత్ నాగ్, వినయ ప్రసాద్, వి.రవిచంద్రన్, ప్రకాష్ బెలవాడి, అనీష్ కురివిల్లా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గోపీ సుందర్ సంగీతాన్ని అందిస్తున్నారు.