విజయశాంతి మళ్ళీ కాంగ్రెస్ గూటికే

- Advertisement -
Vijayashanthi

సీనియర్ నటి విజయశాంతి చాలా కాలంగా రాజకీయాల్లో ఉన్నారు. ఆమె ఇప్పటికే పలు పార్టీలు మారారు. బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ ఇలా పలు పార్టీలు మారి నిన్నటివరకు బీజేపీలో కొనసాగారు. తాజాగా ఆమె బీజేపీ నుంచి బయటికి వచ్చారు.

శుక్రవారం కాంగ్రెస్ నిర్వహించే కుత్బుల్లాపూర్ సభలో విజయశాంతి కాంగ్రెస్ లో చేరనున్నారట. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున మెదక్ సీట్ నుంచి పోటీ చేస్తారట.

మొత్తానికి విజయశాంతి మళ్ళీ కాంగ్రెస్ గూటికే వచ్చారు. ఆమె ఇంతకుముందు బీజేపీ నుంచి ఒకసారి బయటికి వచ్చి మళ్ళీ చేరారు. ఇప్పుడు మరోసారి బయటికి వచ్చారు. అలాగే కాంగ్రేస్ నుంచి ఒకసారి బయటికి వచ్చి మళ్ళీ చేరుతున్నారు.

ఆమె తాజాగా కళ్యాణ్ రామ్ సినిమాలో కూడా నటిస్తున్నారు.

More

Related Stories