ముహూర్తం కోసం చూస్తున్న రాములమ్మ

Vijayashanti

ఈ రోజే విజయశాంతి బీజేపీలో చేరనుంది అని జోరుగా ప్రచారం జరిగింది. మీడియా ఆ వార్తలతో హోరెత్తించింది. కానీ విజయశాంతి ఢిల్లీకి వెళ్లనూ లేదు, బీజేపీ తీర్థం పుచ్చుకోనూ లేదు. విజయశాంతి ఢిల్లీకి వెళ్తుంది అనుకుంటే పవన్ కళ్యాణ్ వెళ్ళాడు.

ఇంతకీ విజయశాంతి కాంగ్రెస్ కి గుడ్ బై చెప్తుందా? లేక కంటిన్యూ అవుతుందా? ఆమె పార్టీ మారడం ఖాయం అని అంటున్నారు. కాకపోతే, బీజేపీలో చేరేందుకు ఆమె మంచి ముహూర్తం చూసుకుంటున్నట్లు టాక్. GHMC ఎన్నికల లోపు చేరుతారా? లేదా తర్వాత అన్నది చూడాలి.

విజయశాంతి బీజేపీలో మళ్ళీ చేరితే, ఇటు తెలంగాణ, అటు తమిళనాడు ..రెండూ రాష్ట్రాల్లో ఆమెతో ప్రచారం చేయిస్తారు. తమిళనాడులో కూడా ఆమె చాలా పాపులర్. వచ్చే వేసవిలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. విజయశాంతి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తొలినాళ్లలో కొన్నాళ్ళు బీజేపీలో ఉంది. ఆ తర్వాత బీజేపీకి గుడ్ బై చెప్పి టీఆరెస్ లో చేరి ఎంపీగా గెలిచింది. తర్వాత టీఆరెస్ కి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరింది. మళ్ళీ ఇప్పుడు బ్యాక్ తో బీజేపీ అన్నమాట.

More

Related Stories