
GHMC ఎన్నికల్లో దాదాపు 50 సీట్లు రావడంతో… బీజేపీకి తెలంగాణలో అధికారం మీద నమ్మకం కలిగింది. బెంగాల్ లో ఎలా రాజకీయ ఎత్తుగడలు వేసి ఇప్పుడు సీఎం మమతా బెనర్జీకి ముచ్చెమటలు పట్టిస్తుందో….అలాగే ఇక్కడ కూడా 2023 నాటికి ఆలా చెయ్యాలని ప్రయత్నిస్తోంది ఆ పార్టీ. బీజేపీకి ఇప్పుడు ఊపు రావడంతో రాములమ్మ విజయశాంతి కూడా ఆ పార్టీ గూటికే చేరింది.
ఆమె ఇప్పుడు యాక్టీవ్ కానుంది. ఇకపై తెలంగాణ అంతా బీజేపీ తరఫున ప్రచారం చేస్తుందట. 2023లో బీజేపీకి అధికారమే లక్ష్యంగా ఆమె ప్రచారం చెయ్యాలనుకుంటుంది. ఐతే, విజయశాంతి ప్రచారం చేస్తే ఓట్లు పడుతాయా అన్నది మిలియన్ డాలర్ ప్రశ్న.
ఇప్పటివరకు ఆమె రాజకీయ కెరీర్లో ఒకే ఒక్కసారి గెలిచింది. అది కూడా టీఆరెస్ పార్టీ సింబల్ పై. ఆమె ఇంతకుముందు బీజేపీకి ప్రచారం చేసినా, కాంగ్రెస్ కి ప్రచారం చేసినా నయా పైసా ఉపయోగం కలగలేదు ఆయా పార్టీలకు. అలాగే, ఆమె టీఆరెస్ పార్టీలో కాకుండా ఎక్కడా గెలవలేదు. సొంత సీటే గెలుచుకోలేని రాములమ్మ…ఇపుడు బీజేపీకి ప్రచారం చేసి అధికారంలోకి తెస్తానని శపథం చేస్తున్నారు.
మరి బీజేపీ శక్తియుక్తులు ఈసారి కలిసొస్తే అదే ఆమెకి పదివేలు.