రాజమౌళి తండ్రి బీజేపీ ‘కథలు’

- Advertisement -

రాజమౌళి తండ్రి పేరొందిన రచయిత. మన దేశంలో స్క్రిప్ట్ రైటర్ గా అత్యధిక పారితోషికం తీసుకొనేది ఆయనే. ‘బాహుబలి’ రచయితగా దేశమంతా పేరు తెచ్చుకున్న విజయేంద్రప్రసాద్ బాలీవుడ్ లో కూడా ‘భజ్రంగీ భాయీజాన్’ వంటి హిట్స్ ఇచ్చారు. ఐతే, ఆయన ఎక్కువగా ‘హిందుత్వ’ కథలు వండుతారు అనే విమర్శ కూడా ఉంది.

“ఆర్ ఆర్ ఆర్”, “బాహుబలి” చిత్రాలలో అదే కనిపించింది. ఇప్పుడు ఈ “హిందుత్వ”నే సక్సెస్ ఫార్ములా అని ఆయన గ్రహించినట్లు ఉన్నారు. తాజాగా రాజమౌళి శిష్యుడు అశ్విన్ గంగరాజు ‘వందేమాతరం’ నేపథ్యంగా తీస్తున్న 1770 అనే సినిమాకి ఆయన కథ అందిస్తున్నారు. అది కూడా ఇలాంటి చిత్రమే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక కంగనా రనౌత్ తీస్తున్న పలు చిత్రాలకు ఆయనే కథ ఇస్తున్నారు. అందుకే, ఆయనని తమ వాడిగా ఓన్ చేసుకొంది భారతీయ జనతా పార్టీ.

విజయేంద్రప్రసాద్ కి రాజ్యసభ పదవి కూడా కట్టబెట్టింది బీజేపీ. దానికి కృతజ్ఞతగా కాబోలు ఆయన తాజాగా “ఆర్ ఎస్ ఎస్” గొప్పదనం అందరికి తెలిసేలా ఒక సినిమా, ఒక వెబ్ సిరీస్ కి స్క్రిప్ట్ ఇస్తున్నట్లు ప్రకటించారు. మొత్తంగా ఆయన “ఆర్ ఎస్ ఎస్”, బీజేపీ అనుకూల రైటర్ గా మారిపోయారు.

ఇప్పుడు దేశంలో కూడా వారి హవానే నడుస్తోంది కాబట్టి ఆయనికి ఈ ముద్రతో లాభమే తప్ప నష్టం లేదు కదా!

 

More

Related Stories