విజయ్ సినిమాతో బూస్టప్ వస్తుందా?

Master

విజయ్ హీరోగా రూపొందిన “మాస్టర్” సినిమా ఇండియా అంతా విడుదల అవుతోంది. తమిళంతో పాటు హిందీ, తెలుగు భాషల్లో కూడా పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. కరోనా సంక్షోభంలో థియేటర్లో విడుదల అవుతున్న మొదటి పాన్-ఇండియా మూవీ ఇది.

ఈ సినిమా తమిళనాడు, కేరళ మార్కెట్ కి బూస్టప్ ఇస్తుంది అని భావిస్తున్నారు. తెలుగులో మాస్టర్ తో పాటు రవితేజ నటించిన క్రాక్, రామ్ నటించిన రెడ్, “అల్లుడు అదుర్స్” వంటి పెద్ద సినిమాలున్నాయి కాబట్టి “మాస్టర్” సినిమాని మన దగ్గర మార్కెట్ కి బూస్ట్ ఇచ్చే సినిమాగా పరిగణించలేం. కానీ తమిళనాడు, కేరళ, కర్ణాటక మార్కెట్ లకు ఈ సినిమా కీలకం.

అలాగే, అమెరికాలో కూడా ఈ సినిమా ప్రీమియర్ కానుంది. ఈ సినిమాకి అమెరికాలో వచ్చే కలెక్షన్లను బట్టి మన ఓవర్సీస్ మార్కెట్ ట్రెండ్ ఎలా ఉంటుందో తెలుస్త్రుంది. ఇది మాస్, క్లాస్ కలిసిన యాక్షన్ మూవీ. విజయ్ తో పాటు విజయ్ సేతుపతి నటించాడు. దర్శకుడు లోకేష్ కనగరాజు ఇంతకుముందు తీసిన “ఖైదీ” సినిమా సంచలనం సృష్టించింది. సో, దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి.

More

Related Stories