విజయ్ ట్రిక్ వర్కౌట్ అయిందా?

Vijay

తమిళ హీరో విజయ్ తండ్రి ..విజయ్ పేరు మీద ఒక రాజకీయ పార్టీ పెట్టినట్లు ప్రకటించాడు. “ఆల్ ఇండియా దళపతి విజయ్ మక్కల్ ఇయ్యకం” పేరుతో పార్టీ పెట్టినట్లు ఒక లేఖని తన త్రండి SA చంద్రశేఖర్ లీక్ చేసిన కొన్ని గంటలకే … విజయ్ స్పందించాడు. ఈ వార్తని తాను మీడియా ద్వారా తెలుసుకున్నానని, ఈ పార్టీకి తనకు ఎలాంటి సంబంధం లేదంటూ ప్రకటించాడు.

తండ్రి పార్టీ పెట్టాడట… కొడుక్కి తెలీదంట. పైగా తండ్రి పార్టీ ప్రకటించిన పార్టీలో తన అభిమానులు ఎవరూ చేరొద్దని చెప్తున్నాడు. ఇదంతా పక్కా ప్లాన్ తోనే జరుగుతోంది అనిపిస్తోంది. ఎందుకంటే, రజినీకాంత్ తాను పార్టీ పెట్టలేను అని గత వారమే హింట్ ఇచ్చాడు. హెల్త్ దృష్ట్యా తాను రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వొద్దని రజినీకాంత్ భావిస్తున్నారు. దాంతో, రజిని తర్వాత అంత మాస్ ఫాలోయింగ్ ఉన్నది విజయ్ కే కాబట్టి … ఈ పాచిక వేసినట్లు అనుకోవాలి.

ఒక వేళ పార్టీ పెడితే, జనం ఏమనుకుంటారు అని ఆలోచనతో ఇలా చేసి ఉండొచ్చనేది విశ్లేషకుల మాట.

విజయ్ కి రాజకీయ ఆలోచనలున్నాయి. ఆయన తన సినిమాల్లో పొలిటికల్ డైలాగ్స్, సెటైర్స్ జొప్పిస్తున్నాడు. తమిళనాడు సీఎం కావాలని విజయ్ భావిస్తున్నాడు. రజినీకాంత్, కమల్ హాసన్ లకు రాజకీయంగా గెలిచే పరిస్థితి లేదు ఇప్పుడు. సో… వాక్యూమ్ ని తాను వాడుకోవాలని అనుకుంటున్నాడు విజయ్.

ఐతే, వరుస విజయాలతో కెరీర్ దూసుకెలుతున్న ఈ టైమ్లో విజయ్ రిస్క్ తీసుకోక పోవచ్చు. 2021 వేసవిలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఐతే, విజయ్ ఆలోచన 2026 ఎన్నికలు టార్గెట్. ఎందుకంటే విజయ్ వయసు 46 ఏళ్ళు మాత్రమే. 50 దాటాక పొలిటికల్ ఎంట్రీ ఇస్తాడట.

Related Stories