విక్రమ్ ఖాతాలోనే ఆ రికార్డు

Kamal Haasan

మొన్నటివరకు బాహుబలి 2దే రికార్డు. దాన్ని కమల్ హాసన్ చిత్రం చెరిపేసింది. కమల్ హాసన్ నటించిన ‘విక్రమ్’ తమిళనాడులో అత్యధిక వసూళ్లు పొందిన చిత్రంగా నిలబడింది. రజినీకాంత్, విజయ్, అజిత్ వంటి హీరోల సినిమాలను మించి ‘విక్రమ్’ ఆడింది. సో, బాహుబలి 2 సహా అన్ని రికార్డులు తమిళనాడులో మటాష్.

‘విక్రమ్’ అతిపెద్ద హిట్ గా నిలిచింది తమిళనాడులో.

కమల్ హాసన్ అప్పులన్నీ ఈ సినిమా తీర్చేసింది. ఇప్పుడు కమల్ హాసన్ సినిమాలకు తమిళనాట బాగా క్రేజ్ పెరిగింది. డిస్ట్రిబ్యూటర్లు కమల్ ని మరిన్ని సినిమాలు చెయ్యమని అడుగుతున్నారట. ఒక్క సినిమాతో ఆయన పాతికేళ్ల క్రితం ఉన్న డిమాండ్ ని పొందుతున్నారు.

కమల్ దశ తిరిగినట్లే, దర్శకుడు లోకేష్ కనగరాజ్ స్టార్డం కూడా మారింది. ‘ఖైదీ’, ‘మాస్టర్’, ‘విక్రమ్’… ఈ మూడు సినిమాలతో లోకేష్ కనగరాజ్ అగ్ర దర్శకుల జాబితాలోకి చేరిపోయాడు.

 

More

Related Stories