నేను విలన్ని కాదు: విక్రమ్

Vikram

“అపరిచితుడు”, “శివపుత్రుడు” వంటి సినిమాలతో సంచలనం సృష్టించిన విక్రమ్ హవా ఇప్పుడు తగ్గింది. క్రేజ్ కూడా పోయింది. ఎంత క్రేజ్ తగ్గినా, ఎన్ని ఫ్లాప్లు వచ్చినా… అయన స్థాయి తక్కువేమి కాదు. అందుకే… విక్రమ్ విలన్ అఫర్ ని రిజెక్ట్ చేసినట్లు సమాచారం.

అల్లు అర్జున్ హీరోగా రూపొందుతోన్న “పుష్ప” సినిమాలో విలన్ గా నటించేందుకు విక్రమ్ అంగీకరించినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. విక్రమ్ మేనేజర్ ఈ రిపోర్ట్స్ తోసిపుచ్చాడు. విక్రమ్ ఆ సినిమా సైన్ చెయ్యలేదని స్పష్టం చేశాడు. ఆయన విలన్ పాత్రలోకి షిఫ్ట్ అయ్యే ఆలోచనల్లో లేడు.

ఈ సినిమాలో మొదట ఈ పాత్రకి తమిళ్ స్టార్ విజయ్ సేతుపతిని తీసుకున్నారు. కానీ సేతుపతి ఎందుకో గాని తప్పుకున్నాడు. ఆ తర్వాత నారా రోహిత్ సహా పలువురు సౌత్ ఇండియన్ స్టార్స్ ని అడిగారు. ఇంకా ఎవరూ సెట్ కాలేదు.

More

Related Stories