ఈ హీరో తాత అయ్యాడు

హీరో విక్రమ్ ఫిజిక్, మెలితిరిగిన దేహం చూసి అతను ఇంకా యూత్ అనుకుంటారు. కానీ 54 ఏళ్ల విక్రమ్ అప్పుడే తాత అయ్యాడు. విక్రమ్ కుమార్తె అక్షిత, పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

దివంగత నేత కరుణానిధి మునిమనవడు మనురంజిత్, విక్రమ్ కుమార్తె అక్షిత లవ్ చేసుకున్నారు. వీళ్ల ప్రేమను అంగీకరించిన పెద్దలు.. 2017లో దగ్గరుండి వివాహం జరిపించారు. కరుణానిధి సమక్షంలో చెన్నైలోని గోపాలపురంలోని ఆయన ఇంట్లోనే సింపుల్ గా పెళ్లి జరిగింది.

అలా వైవాహిక జీవితంలోకి ఎంటరైన అక్షిత, నిన్న సాయంత్రం ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో విక్రమ్ తాత అయ్యాడు.

విక్రమ్ కొడుకు ధృవ్ రీసెంట్ గా హీరో అయ్యాడు. మరోవైపు విక్రమ్ కూడా సినిమాలు కొనసాగిస్తున్నాడు. 54 ఏళ్ల విక్రమ్ త్వరలోనే ‘కోబ్రా’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకురాబోతున్నాడు. ఎప్పట్లానే ఈ సినిమాలో కూడా కొత్త మేకోవర్ తో పాటు తన కండలు చూపించబోతున్నాడు ఈ విలక్షణ నటుడు.

Related Stories