విక్రమ్ కోలుకుంటున్నారట!


హీరో విక్రమ్ వేగంగా కోలుకుంటున్నారట. ఛాతి నొప్పితో ఆయన శుక్రవారం చెన్నైలోని ఒక ఆసుపత్రిలో చేరారు. విక్రమ్ కి హార్ట్ అటాక్ అని మొదట ప్రచారం జరిగింది. కానీ, ఛాతిలో నొప్పి కారణంగా ఆయన మా ఆసుపత్రికి వచ్చారు…. ట్రీట్మెంట్ ఇచ్చామని ఆ ఆసుపత్రి ఒక ప్రకటనలో తెలిపింది.

“మా నాన్న కోలుకుంటున్నారు. ప్రస్తుతం కండిషన్ బాగుంది,” అని విక్రమ్ కొడుకు ధృవ్ తాజాగా మీడియాకి చెప్పారు.

ఆయనకి విశ్రాంతి అవసరం. విక్రమ్ కి 56 ఏళ్ళు. ఒక కొడుకు, ఒక కుమార్తె. కూతురు పెళ్లి ఇటీవలే జరిగింది. కొడుకు ధృవ్ హీరోగా రాణిస్తున్నాడు.

విక్రమ్ నటించిన కోబ్రా వచ్చేనెల విడుదల కానుంది. ఇక మణిరత్నం దర్శకత్వంలో నటించిన పొన్నియన్ సెల్వన్ మొదటి భాగం సెప్టెంబర్ ఓ రిలీజ్ అవుతుంది.

 

More

Related Stories