
కమల్ హాసన్ హీరోగా నటించిన సినిమా ఖైదీ. లోకేష్ కనగరాజ్ దర్శకుడు. ఈ సినిమాకు కథ కూడా అతడే. అయితే విక్రమ్ సినిమా కథ తనది అంటున్నారు హీరో కమల్ హాసన్. తను చెప్పిన సూచనల ఆధారంగానే విక్రమ్ కథ వచ్చిందంటున్నారు.
“ఖైదీ నేను చూశాను. మంచి సినిమా. కానీ విక్రమ్ సినిమా మాత్రం ఖైదీ రిలీజ్ కు ముందు సైన్ చేశాను. ముందు లోకేష్ ఓ స్టోరీ తెచ్చాడు. ఇంకా మంచి స్టోరీ కావాలని చెప్పాను. నిజానికి విక్రమ్ కు ముందు నేను ఓ కథ ఓకే చేశాను. దాని పేరు హిట్ లిస్ట్. కానీ ఆ సినిమా వర్కవుట్ కాలేదు. అది నా మనసులో అలానే ఉండిపోయింది. లోకేష్ అడిగిన వెంటనే నా మనసులో ఉన్న కథను జస్ట్ స్టోరీలైన్ గా, ఓ 10 వాక్యాల్లో చెప్పానంతే. అది చాలు సర్ అన్నాడు. వెళ్లి డవలప్ చేసుకొని వచ్చాను.”

ఇలా విక్రమ్ సినిమా లైన్ తనదేనని క్లెయిమ్ చేసుకున్నారు కమల్ హాసన్. ఈరోజు థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. చాన్నాళ్ల తర్వాత కమల్ హాసన్, ఈ సినిమాతో హిట్ అందుకున్నారు. కమల్ యాక్టింగ్ తో పాటు.. అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు హైలెట్ గా నిలిచింది. విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ నటన మరో హైలెట్.