ఫైనల్ స్టేజిలో ‘విక్రమ్’

- Advertisement -

కమల్ హాసన్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. మళ్ళీ సెట్ పైకి వచ్చారు కమల్. ఆయన నటిస్తున్న తాజా చిత్రం.. విక్రమ్. ఈ నెల 10 నుంచి షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ రోజు (డిసెంబర్ 22) నుంచి కమల్ హాసన్ షూటింగ్ షురూ చేశారు.

‘ఖైదీ’, ‘మాస్టర్’ వంటి సినిమాలు తీసిన లోకేష్ కనకరాజ్ ఈ సినిమాకి డైరెక్టర్. ఫాహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి కూడా నటిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకొంది. వచ్చే ఏడాది ఏప్రిల్ లో సినిమా విడుదల కానుంది.

ఈ సినిమా పూర్తి కాగానే ‘భారతీయుడు 2’ గురించి ఒక నిర్ణయం తీసుకుంటారు కమల్. శంకర్ దర్శకత్వంలో మొదలైన ఆ సినిమా ఏడాదిన్నర కాలంగా ఆగింది. నిర్మాత, దర్శకుడు శంకర్ మధ్య వివాదం నడుస్తోంది. ఐతే, శంకర్ ఈ సినిమాని పూర్తి చెయ్యాల్సిన అవసరం ఉంది. కమల్ హాసన్ కూడా డేట్స్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు.

మరోవైపు, లోకేష్ కనకరాజు తెలుగులో కూడా ఒక స్ట్రయిట్ సినిమా చేసేందుకు ఒప్పుకున్నారు. మైత్రి మూవీస్ బ్యానర్ లో ఆ మూవీ ఉంటుంది.

 

More

Related Stories