విక్రాంత్, మెహ్రీన్ లతో ‘స్పార్క్’

Vikranth and Mehreen

ఒక కొత్త హీరోతో భారీ బడ్జెట్ మూవీ రూపొందుతోంది. విక్రాంత్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్నాడు ఈ చిత్రంలో. మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తోంది. కథ నచ్చితే చాలు కొత్త హీరోతో నటించేందుకు సిద్ధం అంటోంది మెహ్రీన్. అలా ఈ కొత్త హీరో సరసన మూవీ చేస్తోంది.

‘స్పార్క్’ తాజాగా హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైంది. తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిష్టర్ తలసాని శ్రీనివాస యాదవ్, MP రంజిత్ రెడ్డి, సురేందర్ రెడ్డి, రత్నవేలు, అన్వేష్ రెడ్డి, పారిశ్రామికవేత్త రామరాజు సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

రత్నవేల్‌ దగ్గర అసోసియేట్‌ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన అరవింద్‌ కుమార్‌ రవివర్మ ‘స్పార్క్’ చిత్రంతో డైరక్టర్‌గా పరిచయమవుతున్నారు. యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి డైరక్షన్‌ చేస్తూనే, సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు అరవింద్ కుమార్ వర్మ.

ఒక పేరొందిన సంగీత దర్శకుడు మ్యూజిక్ ఇస్తాడట.

 

More

Related Stories