
విక్రాంత్ అనే కొత్త హీరో ఎక్కడా తగ్గట్లేదు. హీరో అతనే, రైటర్ అతనే, దర్శకుడు అతనే. అలాగే తానే సినిమా నిర్మిస్తున్నాడు. ప్రమోషన్ కూడా గట్టిగా చేస్తున్నాడు. ఆయన తీసిన సినిమా ‘స్పార్క్’ నవంబర్ 17న విడుదల కాబోతోంది.
విక్రాంత్ సరసన మెహ్రీన్, రుక్సర్ నటించారు. “ఖుషి” ఫేమ్ హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతాన్ని అందించారు.
“నేను ఇండియాకు వచ్చి సినిమా తీస్తాను అంటే డబ్బులు పోగొట్టుకుంటావ్ అని అందరూ అన్నారు. కానీ మంచి చిత్రం తీస్తే తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం నాకు ఉంది. నవంబర్ 17న తలెత్తే అవకాశాన్ని ఆ దేవుడు నాకు ఇస్తాడని ఆశిస్తున్నాను. ఏది తగ్గకుండా, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించాం,” అని అంటున్నారు విక్రాంత్.
ఈ చిత్రంలో మెహ్రీన్ లేఖ అనే పాత్రలో నటించింది. “స్పార్క్ సినిమాకు ప్రేక్షకుల ప్రేమ కావాలి,” అని మెహ్రీన్ కోరింది.
“విక్రాంత్ నటుడిగానే కాకుండా అన్ని క్రాఫ్ట్‌లను చక్కగా చూసుకున్నారు. ఆయన పడ్డ కష్టానికి తగ్గ ప్రతిఫలిం రావాలి,” అని మరో భామ రుక్సర్ విష్ చేసింది.