
యువ హీరో కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా రూపొందిన మరో చిత్రం… ‘వినరో భాగ్యము విష్ణు కథ’. బన్నీ వాసు నిర్మాతగా జిఏ 2 పిక్చర్స్ బ్యానర్లో నిర్మించిన మూవీ ఇది. ఫిబ్రవరి 17న ధనుష్ నటిస్తున్న ‘సార్’ సినిమాకి పోటీగా నిలబడుతుందనుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఒక రోజు ఆలస్యంగా వస్తోంది.
ఈ సినిమా U/A సర్టిఫికెట్ పొందింది. ఫిబ్రవరి 18న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాతలు తాజాగా ప్రకటించారు. ‘సార్’ నిర్మాతలు, ఈ మూవీ నిర్మాతలు మాట్లాడుకొని డైరెక్ట్ పోటీ వద్దనుకున్నారట. రెండు సినిమాలకు మంచి ఓపెనింగ్స్ రావాలంటే ఇది బెటర్.
కిరణ్ ఇటీవల ఫ్లాపులు చూశాడు. అలాగే ఈ రెండు సంస్థలు కూడా ఇటీవల సరైన హిట్ అందుకోలేదు. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది.
తిరుమల తిరుపతి నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాతో మురళి కిషోర్ అబ్బురు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం దర్శకత్వం అందించారు.