లూసిఫర్ తో వినాయక్ కుస్తీ

Vinayak with Chiranjeevi

కొత్త కథ అంటే చాలా కసరత్తు చెయ్యాలి. ప్లస్, ఎన్నో డౌట్స్ ఉంటాయి. ఆల్రెడీ వేరే భాషలో హిట్టైన సినిమా ఐతే సేఫ్ గేమ్. డైరెక్టర్ కరెక్ట్ గా తీస్తున్నాడా లేదా అనేది యిట్టె పట్టెయ్యగలరు మెగాస్టార్ చిరంజీవి. అందుకే ఆయన తన కొత్త ఇన్నింగ్స్ లో ఎక్కువగా రీమేక్ చిత్రాలపై మోజు పెంచుకుంటున్నట్లు కనిపిస్తోంది. “ఖైదీ నంబర్ 150” తర్వాత ఆయన ఇప్పుడు “ఆచార్య” సినిమాలో నటిస్తున్నారు. “ఆచార్య” స్ట్రైట్ మూవీ. తర్వాత… తమిళంలో హిట్టైన “వేదాళం”, మలయాళంలో విజయవంతమైన “లూసిఫర్” సినిమాలను తెలుగులో తీసేందుకు చిరంజీవి గ్రీన్ సిగ్నలిచ్చారు.

అందులో …”లూసిఫర్” సినిమాని వినాయక్ కి అప్పచెప్పారు. వినాయక్ ఇంతకుముందు చిరంజీవి హీరోగా “టాగోర్”, “ఖైదీ నంబర్ 150” చిత్రాలు తీస్తే… ఆ రెండూ భారీ బ్లాక్బస్టర్లుగా నిలిచాయి. రెండూ కూడా తమిళ్లో హిట్టైన సినిమాల ఆధారంగా తీసినవే. అందుకే… వినాయక్ కి “లూసిఫర్” రీమేక్ ని అప్పగించారు. దీన్ని తెలుగులో తీస్తే ఎలా తీయాలో ఇప్పటికే ఒక వర్షన్ నేరేషన్ ఇచ్చాడట వినాయక్… ఇప్పుడు దాన్ని ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ గా మార్చే పని లో ఉన్నారు వినాయక్.

ఈ రీమేక్ వచ్చే ఏడాది సెకండాఫ్ లో మొదలవ్వచ్చు.

ఐతే… వినాయక్ రీసెంట్ గా ఫామ్ లో లేరు. సాయి ధరమ్ తేజ్ హీరోగా ఆయన తీసిన మూవీ “ఇంటెల్లిజింట్” దారుణంగా పరాజయం పాలైంది. ఆ తర్వాత తానే హీరోగా “శీనయ్య” అనే మూవీ మొదలు పెట్టి పక్కన పెట్టారు. అందుకే… “లూసిఫర్” విషయంలో ఆయన కుస్తీ పడుతున్నారట.

Related Stories