మహేష్, పవన్ మిగిలారు!

దర్శకుడు వీవీ వినాయక్ తన మనసులో మాట బయటపెట్టాడు. ఇప్పుడున్న స్టార్ హీరోల్లో మహేష్, పవన్ తో సినిమాలు చేయాలని ఉందనే కోరికను బయటపెట్టాడు. ఎందుకంటే… వారిద్దరితో తప్ప దాదాపు అందరు అగ్ర హీరోలతో సినిమాలు తీశారు వినాయక్. వాళ్లతో ఎప్పటికప్పుడు టచ్ లోనే ఉంటున్నానని, కానీ ఆ టైమ్ వచ్చినప్పుడు సినిమా సెట్ అవుతుందని అంటున్నాడు.

మరోవైపు అఖిల్ మూవీ తర్వాత తనలో టాలెంట్ తగ్గిందంటూ వస్తున్న విమర్శల్ని కొట్టిపారేస్తున్నాడు వినాయక్. ప్రతి మనిషికి గుడ్ డేస్, బ్యాడ్ డేస్ అనేవి ఉంటాయని.. వాటిని దాటుకుంటూ వెళ్లాలని చెబుతున్నాడు. తనపై వస్తున్న విమర్శల్ని ఎప్పుడూ పట్టించుకోనని, ప్రతి రోజూ సినిమాకు సంబంధించి ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటానని అంటున్నాడు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన వినాయక్.. మంచి టైమ్ చూసి బౌన్స్ బ్యాక్ అవుతానంటున్నాడు. చూస్తుంటే ఈసారి భారీ ప్రాజెక్టుతో వినాయక్ ఎంట్రీ ఇచ్చేలా ఉన్నాడు. చిరంజీవి చేయబోయే లూసిఫర్ ప్రాజెక్టు ఈ దర్శకుడి చేతిలోకే వెళ్లింది.

Related Stories