కృష్ణంరాజు, ప్రభాస్ వైరల్ ఫొటో

Viral pic of Krishnam Raju celebrating Prabhas’s birthday when the latter was in teens.

ఈ నెలాఖరుకు ప్రభాస్ పుట్టినరోజు ఉంది. దీనికి సంబంధించి కౌంట్ డౌన్ ను గత నెల్లోనే స్టార్ట్ చేశారు రెబల్ స్టార్ అభిమానులు. రోజుకో కొత్త మేటర్, ఫొటోతో ప్రభాస్ పుట్టినరోజు టాపిక్ ను ట్రెండింగ్ లో పెడుతున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలోకొచ్చిన ఓ ఫొటో.. నిన్నట్నుంచి ప్రభాస్ ఫ్యాన్  గ్రూప్స్ లో తెగ వైరల్ అవుతోంది.

ఇప్పుడు మీరు చూస్తున్న ఫొటోనే ఆ స్టిల్. ప్రభాస్ సినిమాల్లోకి రాకముందు తీసిన  ఫొటో ఇది. మరీ ముఖ్యంగా ప్రభాస్ పుట్టినరోజు నాడు జరిగిన సెలబ్రేషన్ స్టిల్ అది. పెదనాన్న కృష్ణంరాజు, ప్రభాస్ కు ఆప్యాయంగా కేక్ తినిపిస్తున్న ఈ ఫొటోను నిన్నట్నుంచి వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్.

ఇప్పటికీ తన ప్రతి పుట్టినరోజును పెదనాన్నతో సెలబ్రేట్ చేసుకోవడం ప్రభాస్ కు ఇష్టం. అయితే ఈ నెలలో జరగబోయే పుట్టినరోజును ప్రభాస్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటాడనేది ప్రశ్న. ఎందుకంటే.. అతడు ఇప్పటికే తన కొత్త సినిమా కోసం యూరోప్ షెడ్యూల్ ప్లాన్ చేశాడు.

Related Stories