- Advertisement -

లవ్ స్టోరీ సినిమాలాగే ఇతర సినిమాలు కూడా డేట్స్ మార్చుకోనున్నాయి. మరి రానా నటించిన ‘విరాటపర్వం’ పరిస్థితి ఏంటి? ఈ సినిమా ఏప్రిల్ 30న విడుదల కానుంది. అప్పటికి పరిస్థితులు మెరుగైతే, రిలీజ్ డేట్ మార్చుకోవాలిసిన అవసరం లేదు. కానీ టీం మాత్రం ముందే ప్రమోషన్లు బంద్ చేసింది.
వాయిదా వేయడమే బెటర్ అని టీం ఫిక్స్ అయిందట. ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్ల వైపు చూపు వెయ్యడం లేదిప్పుడు. అదే పెద్ద సమస్యగా మారింది. అందుకే… విరాటపర్వం సినిమా డేట్ విషయంలో నిర్మాతలు మౌనం వహిస్తున్నారు. ఈ సినిమా కూడా సాయి పల్లవి చుట్టూనే తిరుగుతుంది.
అటు లవ్ స్టోరీ, ఇటు విరాటపర్వం రెండూ సాయి పల్లవి చిత్రాలే. ఈ రెండు సినిమాల విడుదల తేదీలపై క్లారిటీ లేదు.