విరాటపర్వం…అడ్డంకి అదే

సాయి పల్లవి ఎంతో ఇష్టంగా చేసిన చిత్రాలు రెండు. ఒకటి శేఖర్ కమ్ముల మూవీ “లవ్ స్టోరీ”, మరోటి “విరాటపర్వం”. ఈ రెండూ గతేడాదే విడుదల కావాలి. కానీ కరోనా అడ్డు వచ్చింది. మొత్తానికి ‘లవ్ స్టోరీ’ థియేటర్లలోకి వచ్చింది. మరి, “విరాట పర్వం” విడుదల ఎప్పుడు?

రానా, సాయి పల్లవి నటించిన చిత్రం… విరాటపర్వం. ఇందులో రానా నక్సలైట్ గా నటించాడు. ఈ సినిమాకి వేణు ఉడుగుల దర్శకుడు. సాయి పల్లవిదే మెయిన్ పాత్ర. ఆమె చుట్టే కథ తిరుగుతుంది.

రానా ఈ సినిమాని ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ కి అమ్మేశారని టాక్. నెట్ ఫ్లిక్స్ తో రానాకి మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఇంతకుముందు తమ సంస్థ నిర్మించిన “కృష్ణ అండ్ హిజ్ లీల”ని మంచి రేట్ కి డైరెక్ట్ గా అమ్మేశాడు. ఇటీవల ఒక వెబ్ డ్రామా (“రానా నాయుడు”) ఒప్పందం చేసుకున్నాడు నెట్ ఫ్లిక్స్ తో. అదే ప్యాకేజ్ లో “విరాటపర్వం” కూడా డైరెక్ట్ డిజిటల్ విడుదలకు మాట్లాడుకున్నట్లు టాక్. కానీ ఒప్పందం కాలేదు.

“లవ్ స్టోరీ”తో పాటు త్వరలో థియేటర్లో విడుదల కానున్న సినిమాల రెస్పాన్స్ చూసి దీన్ని థియేటర్లో విడుదల చెయ్యాలా లేక డైరెక్ట్ గా నెట్ ఫ్లిక్స్ లోనే రిలీజ్ చెయ్యాలా అనేది డిసైడ్ చేస్తాడట. అప్పటివరకు ఈ సినిమా విడుదలపై సస్పెన్స్ తప్పదు.

 

More

Related Stories