2 వారాలకే నెట్ ఫ్లిక్స్ లోకి!


రానా, సాయి పల్లవి నటించిన ‘విరాటపర్వం’ ఈ నెల 17న విడుదలయింది. ఎన్నో అంచనాల మధ్య థియటర్లలోకి వచ్చింది. కానీ, సినిమా దారుణంగా పరాజయం పాలైంది. మూడు రోజులకే సినిమాని తిప్పేశారు. దాదాపు 20 కోట్లతో తీసిన మూవీ కేవలం 3 కోట్ల రూపాయల వసూళ్లు అందుకొంది.

ఇంత ఘోరంగా ఫ్లాప్ కావడంతో రెండు వారాలకే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ చేస్తున్నారు. జులై 1న ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంటుంది. థియేటర్లలో విడుదలైన రెండు వారాలకే ఓటిటి వేదికపైకి వచ్చిన సినిమాల్లో ఇదొకటి.

నిజానికి ఈ సినిమాని ముందుగా నెట్ ఫ్లిక్స్ లో డైరెక్ట్ గా విడుదల చేద్దామనుకున్నారు. దాదాపు 30 కోట్ల డీల్ వచ్చింది. కానీ, రానా ఇది ఎక్కువ వసూళ్లు అందుకుంటుంది అని భావించాడు. అలా, థియేటర్లలో విడుదలైంది. జనం మాత్రం నిర్ధాక్షణ్యంగా తిప్పికొట్టారు.

సాయి పల్లవి కెరీర్లో మంచి పేరు వచ్చిన చిత్రం. కానీ, జనం మాత్రం చూడలేదు.

 

More

Related Stories