విశాల్ ఓటీటీ అడుగులు

Vishal

తమిళనాడు థియేట్రికల్ యాజమాన్యాలకు, డిస్ట్రిబ్యూటర్లకు మరో షాకింగ్ న్యూస్. హీరో విశాల్ కూడా తన కొత్త సినిమాను ఓటీటీకి ఇచ్చే ఆలోచనలో ఉన్నాడట. ఈ మేరకు అతడు పలు ఓటీటీ సంస్థలతో చర్చలు షురూ చేసినట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం “చక్ర” అనే సినిమా చేస్తున్నాడు విశాల్. దీనికి నిర్మాత కూడా ఇతడే. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన ట్రయిలర్ ను 4 భాషల్లో విడుదల చేశాడు. సైబర్ క్రైమ్, బ్యాంక్ రాబరీ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను థియేట్రికల్ రిలీజ్ కంటే ముందే ఓటీటీలో స్ట్రీమింగ్ కు ఇవ్వడానికి విశాల్ మొగ్గుచూపుతున్నాడట.

రీసెంట్ సూర్య, తన భార్యను లీడ్ రోల్ లో పెట్టి తీసిన ఓ సినిమాను థియేట్రికల్ రిలీజ్ చేయకుండా నేరుగా ఓటీటీకి ఇచ్చేశాడు. దీనిపై చెలరేగిన దుమారం అంతా ఇంతా కాదు. ఒక దశలో థియేటర్ యజమానులు బాహాటంగానే సూర్యకు హెచ్చరికలు కూడా జారీచేశారు. ఆ వివాదం ఇంకా సద్దుమణగకముందే విశాల్ కూడా ఓటీటీ బాట పట్టాడనే వార్తలు కోలీవుడ్ డిస్ట్రిబ్యూటర్లను కలవరపాటుకు గురిచేస్తున్నాయి.

తమిళనాడులో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునే పరిస్థితులు కనిపించడం లేదు. సెప్టెంబర్-అక్టోబర్ లో థియేటర్లు తెరిచినప్పటికీ ప్రేక్షకులు వస్తారనే నమ్మకం లేదు. అందుకే తన సిమాను ఓటీటీకి ఇచ్చేయాలని అనుకుంటున్నాడట హీరో కమ్ నిర్మాత విశాల్. 

More

Related Stories