విశాల్ ‘రాజకీయం’ చెయ్యడట!

Vishal


హీరో విశాల్ మొత్తానికి క్లారిటీ ఇచ్చాడు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి విశాల్ అడుగుపెడుతున్నాడు అని వచ్చిన వార్తల నేపథ్యంలో స్పందించాడు. అవన్నీ అబద్దాలని వివరణ ఇచ్చాడు.

విశాల్ ప్రకటన ఇది: “నేను ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు, కుప్పం నుంచి పోటీ చేయబోతున్నట్లు వార్తలు విన్నాను. అవి పూర్తిగా తప్పు. నన్ను ఎవరూ ఇంతవరకు సంపద్రించలేదు. ఇవి ఎలా పుట్టాయో నాకు తెలీదు. సినిమాలు మాత్రమే నా జీవితం. నేను ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టడం లేదు. చంద్రబాబు నాయిడిగారిపై పోటీ చెయ్యబోవడం లేదు. ఇవి పూర్తిగా నిరాధారం.”

విశాల్ కి ఆర్థికంగా చాలా కష్టాలు ఉన్నాయి. ఆయన బ్యానర్ పై నిర్మించిన సినిమాలు అన్ని ఢమాల్ అన్నాయి. తెచ్చిన అప్పులు, కట్టాల్సిన వడ్డీలతో సతమతవుతున్న మాట నిజం. తమిళ చిత్ర పరిశ్రమలో విశాల్ కి ఒకప్పుడు ఉన్న క్రేజ్ ఇప్పుడు పోయింది. ఆయనకి వ్యతిరేక బ్యాచ్ కూడా అక్కడ ఎక్కువే. ఈ నేపథ్యంలోనే ఆయన వైఎస్సార్సీపీలో చేరి ఆర్థిక కష్టాలు తొలగించుకోవాలని భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

ఐతే, విశాల్ కి ఇప్పుడు తెలుగులో పెద్ద సీన్ లేదు. ఆయన రాజకీయాల్లోకి అడుగుపెడితే ఉన్న సినిమా మార్కెట్ కూడా గోవిందా అవుతుంది. అందుకే, భయపడి ఈ వివరణ ఇచ్చినట్లు ఉంది.

 

More

Related Stories