- Advertisement -

హీరో విశాల్ మరోసారి షూటింగ్ లో తీవ్రంగా గాయపడ్డారు. వెన్ను భాగంలో గాయాలయ్యాయి. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు.
“ఎనిమి” అనే సినిమా షూటింగ్ సెట్స్ లో ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ లోనే ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. మరో హీరో ఆర్యతో కలిసి విశాల్ నటిస్తున్న మూవీ.. “ఎనిమి”
క్లైమాక్స్ కోసం భారీ స్టంట్లు కంపోజ్ చేశారు ఫైట్ మాస్టర్స్. స్టంట్ చేసే సమయంలో ప్రమాదవశాత్తు వెనకవైపు నుండి బలంగా గోడకు తాకడంతో కిందపడిపోయారు విశాల్. ఈ ప్రమాదంలో విశాల్ వెన్ను భాగానికి దెబ్బతగిలింది. పిజియోథెరపీస్ట్ డా. వర్మ ఆయనకు వెంటనే చికిత్స అందించారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని త్వరలోనే షూట్‌లో పాల్గొంటారని టీమ్ వెల్లడించింది.
ఈ సినిమాకి విశాలే నిర్మాత.