ప్రస్తుతం సింగిల్: విశాల్

Vishal

రెండేళ్ల క్రితం హైదరాబాద్ కి చెందిన అనిషా రెడ్డితో హీరో విశాల్ నిశ్చితార్థం జరిగింది. పెళ్లి ముహుర్తాలు ఫిక్స్ అయ్యే టైంలో వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు. ఐతే, మళ్ళీ ఆర్నెళ్ల తర్వాత ఇద్దరూ కలిసిపోయారని…. లాక్డౌన్ ముగిసిన వెంటనే పెళ్లి ఉంటుంది అని విశాల్ పీఆర్వోలు మీడియాకి చెప్పారు. కానీ అలాంటిదేమి ఇప్పటివరకు జరగలేదు.

‘చక్ర’ సినిమా విడుదల తర్వాత విశాల్ తన పెళ్లి గురించి స్పందించాడు. ఇటీవల విడుదలైన ‘చక్ర’ మన దగ్గర ఆడలేదు. కానీ తమిళనాడులో కలెక్షన్లు సాధిస్తోంది.

ప్రస్తుతం తాను సింగిల్ అని స్పష్టం చేశాడు. ఎవరితో రిలేషన్ లో లేనని స్పష్టంగా చెప్పాడు. “ఏదైనా శుభవార్త ఉంటుందా అంటే ఏమో జరగొచ్చు అని మాత్రం చెప్పగలను,” అని అన్నాడు. ఐతే ఎక్కడా అనిషా రెడ్డి గురించి, ఆమెతో పెళ్లి గురించి గాని మాట్లాడలేదు.

విశాల్ కిప్పుడు 43 ఏళ్ళు. హీరోగా బాగానే సంపాదించాడు. కానీ తమిళనాడు నటుల సంఘానికి చెందిన రాజకీయాల్లో ఇరుక్కొని ఎక్కువ ఇబందుల పాలయ్యాడు.

More

Related Stories