
తమిళ సూపర్ స్టార్ విజయ్ బాటలో విశాల్ నడుస్తున్నాడు. విశాల్ కూడా త్వరలోనే ఒక రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి. కొంతకాలంగా విశాల్ బీజేపీకి అనుకూలంగా ఉంటున్నారు. ఆయన బీజేపీ తరఫున పోటీ కూడా చెయ్యొచ్చు అని ఆ మధ్య ప్రచారం జరిగింది.
ఐతే, ఇప్పుడు ఏకంగా తనే సొంతంగా పార్టీ ఆలోచన చేస్తున్నారట. తమిళనాడులో జాతీయ పార్టీలకు పెద్దగా ఆదరణ ఉండదు. అందుకే, విజయ్ సొంతంగా పార్టీ పెట్టి 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. ఇప్పుడు విశాల్ కూడా అదే పంథా ఫాలో అవుతున్నారు అని టాక్.
విశాల్ కి హీరోగా ఇప్పుడు పెద్దగా క్రేజ్ లేదు. ఇటీవల “మార్క్ ఆంటోని” అనే సినిమా మినహా మిగతావేవీ ఆడలేదు. పైగా ఆయనకి ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి. సో, ఇప్పుడు రాజకీయాలే బెస్ట్ ఆఫ్సన్ అని భావిస్తున్నట్లు సమాచారం.
46 ఏళ్ల విశాల్ పుట్టింది పెరిగింది చెన్నైలోనే. కానీ వారి కుటుంబ మూలాలు నెల్లూరులో ఉన్నాయి. తెలుగు రెడ్డి కుటుంబం వాళ్ళది. ఇప్పుడు తమిళ రాజకీయాలపై ఫోకస్ పెట్టాడు. జయలలిత, ఎంజీఆర్ కూడా వేరే రాష్ట్రాల్లో మూలాలు ఉన్నా తమిళనాడుని స్వంతం చేసుకొని రాజకీయంగా ఏలారు.