సూర్య బాటలో విశాల్

Vishal

కోలీవుడ్ హీరోలకు, మేకర్స్ కు ఈ లాక్ డౌన్ టైమ్ లో సూర్య ఓ దారి చూపించాడు. పెద్ద హీరోలు డైరక్ట్ ఓటీటీ రిలీజ్ కు వెళ్తే ఏమౌతుందో అనే భయాల్ని-అనుమానాల్ని పటాపంచలు చేశాడు. సూర్య ఇచ్చిన స్ఫూర్తితో ఇప్పుడు విశాల్ కూడా రెడీ అయిపోయాడు. ఈ హీరో నటించిన “చక్ర” సినిమా త్వరలోనే అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో డైరక్ట్ గా రిలీజ్ కాబోతోంది. ఈ మేరకు అగ్రిమెంట్ పూర్తయింది.

నిజానికి సూర్య నటించిన “ఆకాశం నీ హద్దురా” సినిమా కంటే ముందే “చక్ర” సినిమా డీల్ పూర్తికావాల్సి ఉంది. ఈ మేరకు లాక్ డౌన్ టైమ్ లో ట్రయిలర్ కూడా రిలీజ్ చేసి ప్రమోషన్ మొదలుపెట్టాడు ఈ హీరో. కానీ ఇంతకుముందే చెప్పుకున్నట్టు కొన్ని అనుమానాల వల్ల, మరో ఓటీటీ సంస్థతో డీల్ రద్దు అవ్వడం వల్ల విశాల్ వెనక్కి తగ్గాల్సి వచ్చింది.

మొత్తమ్మీద కోలీవుడ్ నుంచి మరో పెద్ద సినిమా ఓటీటీ బాట పట్టింది. ఈ దారిలో ఇంకెంతమంది హీరోలు నడుస్తారో చూడాలి.

Related Stories