
దసరా పండగకి రావాల్సిన “ఆర్ఆర్ఆర్” తప్పుకొంది. ఆ డేట్ ని లాగేసుకోవాల్సిన “ఆచార్య” కూడా ముందుకు రాలేదు. “అఖండ”ది కూడా అయోమయమే. దాంతో, ఈ సారి దసరాకి చిన్న చిత్రాలు, డబ్బింగ్ మూవీస్ బరిలో నిలుస్తున్నాయి. ఈ రేసులో కొత్తగా చేరిన మూవీ… “ఎనిమీ”.
విశాల్, ఆర్య నటించిన మూవీ ఇది. విశాల్ హీరో, ఆర్య విలన్. తెలుగు, తమిళంలో ఒకేసారి దసరాకి విడుదల కానుంది. సినిమా షూటింగ్ దాదాపుగా హైదరాబాద్ లోనే జరిగింది.
విశాల్ ఈ సినిమాపై చాలా అంచనాలు పెట్టుకున్నాడు. చాలా, ఖర్చుతో తీశారు. ఇటీవల విడుదలైన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగులో కూడా స్పందన బాగుంటుంది అని అంచనా వేస్తున్నారు. సో, దసరా బరిలో నిలిచాడు విశాల్. ఈ సారి విజయదశమికి “రౌడీ బాయ్స్”, “మహాసముద్రం” వంటి తెలుగు సినిమాలు పోటీలో నిలిచాయి.
బాలయ్య నటించిన “అఖండ” విడుదల గురించి ఇంకా క్లారిటీ లేదు. సో, విశాల్ సినిమాకి మంచి ఛాన్సులు ఉంటాయి.
ఈ సినిమాకి ఆనంద్ శంకర్ దర్శకుడు. ఈయన ఇంతకుముందు విజయ్ దేవరకొండతో తీసిన ‘నోటా’ పరాజయం పాలైంది.