
రాజకీయ పార్టీలు ఎన్నికలకు ముందు ఎలా మేనిఫెస్టో ప్రకటిస్తాయో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో పోటీచేస్తున్నవారు కూడా అలాగే ప్రకటిస్తున్నారు. ఎన్నికలకు రెండు రోజుల ముందు మంచు విష్ణు ప్యానెల్ తమ మేనిఫెస్టో విడుదల చేసింది.
విష్ణు గెలిస్తే మా సభ్యులకు ఎన్నో లాభాలు ఉంటాయి అనిపిస్తోంది. ఆయన ప్రకటించిన వరాల జల్లు అలా ఉంది మరి.
చదువుకొనే వారికి ఆర్థిక సాయం, హెల్త్ కార్డులు, కల్యాణ లక్ష్మి పథకాలు… ఇలా చాలా ఉన్నాయి. అంతేకాదు మోహన్ బాబు ఫిలిం ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేసి ‘మా’ సభ్యుల పిల్లలకు శిక్షణ ఇస్తారట.
విష్ణు ప్యానెల్ విడుదల చేసిన మ్యానిఫెస్టోలోని మెయిన్ పాయింట్స్
అందరికి అవకాశాలు. దానికోసం ఒక యాప్ క్రియేట్ చెయ్యడం.
లేని వారికి సొంత ఇళ్లు
పిల్లల విద్యకు ఆర్థికంగా సాయం
సొంత డబ్బులతో ‘మా’భవనం
హెల్త్ కార్డులు. పెన్షన్లు
మహిళల రక్షణకి హై పవర్ కమిటీ
కల్యాణలక్ష్మీ తరహాలో రూ.1.16 లక్షలు
‘మా’సభ్యత్వ ఫీజు తగ్గింపు
జాబ్ కమిటీ ఏర్పాటు
మోహన్ బాబు ఫిలిం ఇనిస్టిట్యూట్
‘మా’ ఉత్సవాలు
ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు