
కృతి సనన్ సోదరి నుపుర్ సనన్ తెలుగులో నటిస్తోంది. ఆమె నటించిన మొదటి చిత్రం… టైగర్ నాగేశ్వరరావు. ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 20న విడుదల కానుంది. ఇక తన రెండో తెలుగు చిత్రంగా ఆమె “కన్నప్ప” అనే సినిమా సైన్ చేసింది. మంచు విష్ణు హీరో. భక్త కన్నప్ప కథని పాన్ ఇండియా లెవల్లో తీస్తున్నామని ఆ మధ్య సినిమాని గ్రాండ్ గా లాంఛ్ చేశారు విష్ణు.
కానీ, ఇప్పుడు ఈ సినిమా నుంచి నుపుర్ తప్పుకొంది.
“వేరే సినిమాలకు ఆమె డేట్స్ కేటాయించడం వల్ల ఆమె మా సినిమాకి డేట్స్ ఇవ్వలేకపోతోంది. అందుకే ఆమె ఈ సినిమా నుంచి తప్పుకొంది. త్వరలో మరో చిత్రంలో ఆమెతో కలిసి పనిచేసే అవకాశం వస్తుంది అని ఆశిస్తున్నా,” అని విష్ణు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.అంతే, విష్ణుకి ట్రోలింగ్ మొదలైంది.
“సరే ఇప్పుడు నిజం చెప్పు అన్నా” అని కొందరు పోస్టులు పెట్టగా మరికొందరు “సూపర్” సినిమాలోని అలీ- బ్రమ్మీ సీన్ పెట్టి ట్రోల్ చేస్తున్నారు. ఇంకొందరు… ఆమె తప్పుకుందా లేక “తప్పించుకొని బయటపడిందా అన్నా” అంటూ అడుగుతున్నారు.

మరోవైపు, నుపుర్ సనన్ ఈ విషయంలో ఎలాంటి పోస్ట్ పెట్టలేదు. సైలెంట్ గా తన ఇన్ స్టాగ్రామ్ నుంచి “కన్నప్ప” సినిమా ప్రారంభోత్సవ ఫోటోలు డిలీట్ చేసింది.