- Advertisement -

మంచు విష్ణు హీరోగా ‘గాలి నాగేశ్వరరావు’ అనే సినిమా రూపొందుతోంది. కొంత గ్యాప్ తర్వాత ఆమె నటిస్తున్న తెలుగు చిత్రమే ఇదే. ఈ సినిమాలో సన్ని లియోన్ ఒక కీలక పాత్ర పోషిస్తోంది. ఆమె ఈ సినిమాలో రేణుక అనే పాత్ర చేస్తోంది.
ఈ సినిమా షూటింగ్ గ్యాప్ లో సన్నీ ఒక ప్రాంక్ (ఆటపట్టించే గేమ్) ప్లే చేసింది. ఆ వీడియో ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ రీల్ హల్ చల్ చేస్తోంది. అటు విష్ణుకి, ఇటు సన్నీకి ట్యాగ్ చేస్తూ ఫన్నీ కామెంట్స్ కూడా పెడుతున్నారు వారి ఫాలోవర్స్.
ఈషాన్ సూర్య దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు కోన వెంకట్.
సన్ని లియోన్ గతంలో కూడా మంచు హీరోల చిత్రాల్లో నటించింది.