- Advertisement -

ఇటీవల యాంకర్ గా పాపులర్ అయింది విష్ణు ప్రియ. ఆమె ఇప్పుడు హీరోయిన్ గా ఒక మూవీ చేస్తోంది. ఈ మూవీ పేరు ‘చెక్‌మేట్’. సూటిగా సొళ్లు లేకుండా అనేది ట్యాగ్‌లైన్. ప్రసాద్ వేలంపల్లి దర్శకనిర్మాతగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం ఏప్రిల్11న విడుదలకానుంది.
“మాములుగా ప్రతి ప్రేమకథలో వారి కుటుంభ సభ్యుల నుండి సమస్యలు వస్తాయి. అయితే ఈ సినిమాలో తమ ప్రేమకు తన క్లోజ్ ఫ్రెండ్‌తోనే సమస్య ఏర్పడితే జరిగే పరిణామాలేంటి?..ఆ అమ్మాయి స్నేహితురాలి నుండి తన ప్రేమికుడిని ఎలా కాపాడుకుని తమ ప్రేమని గెలిపించుకుంది అనేది కథాంశం. బలమైన పాత్ర కావడంతో తెలుగు అమ్మాయి చేస్తే బాగుంటుంది అని విష్ణు ప్రియని సెలక్ట్ చేశాం. తన ఫ్రెండ్‌గా దీక్షా పంత్ నటిస్తోంది,” అని చెప్తున్నారు డైరెక్టర్.