నాగ్, చిరుతో విష్ణు పోటీ!

Ginna

మంచు విష్ణు కూడా దసరా బరిలోకి దిగబోతున్నాడు. ఈ విషయాన్ని మంచు విష్ణు తెలిపాడు. దసరాకి పెద్ద సినిమాలు వస్తాయి. ఈ సారి తానూ కూడా బరిలో ఉంటాడట.

విష్ణు మంచు హీరోగా నటించిన ‘జిన్నా’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయింది. ఇక విడుదల డేట్ అనౌన్స్ చేసే టైమొచ్చింది. అక్టోబర్ 5న వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నట్లు విష్ణు తెలిపారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి. అంతా అనుకున్నట్లు జరిగితే అక్టోబర్ 5న ‘జిన్నా’ విడుదల అవుతుందట.

నిజానికి అక్టోబర్ 5 డేట్ ని ఇప్పటికే నాగార్జున లాక్ చేసుకున్నారు. ఆయన నటించిన ‘ది ఘోస్ట్’ సినిమా ఆ డేట్ కి విడుదల కానుంది. ఇప్పటికే నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఇక అదే టైంలో చిరంజీవి నటిస్తున్న ‘గాడ్ ఫాదర్ ‘ కూడా రానుంది. ‘గాడ్ ఫాదర్’ సినిమాని దసరా బరిలో నిలుపుతున్నట్లు ఆ టీమ్ ఇప్పటికే అనౌన్స్ చేసింది. కాకపోతే, పక్కాగా డేట్ చెప్పలేదు.

ఇప్పుడు వీరికి పోటీగా మంచు విష్ణు రానున్నాడు. ‘జిన్నా’ సినిమాకి జి.నాగేశ్వరరెడ్డి మూల కథ అందించారు. క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు కోన వెంకట్. ఇషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కుతోన్నఈ సినిమాలో విష్ణు కూతుళ్లు ఒక పాట కూడా ఆలపించారు.

 

More

Related Stories