
యువ హీరో విశ్వక్ సేన్ గెస్ట్ పాత్రలకు కూడా సై అంటున్నారు. ‘ముఖచిత్రం’ అనే చిత్రంలో ఈ యువ హీరో స్పెషల్ రోల్ చేశారు. 15 నిమిషాల గెస్ట్ రోల్ అది.
ఇందులో లాయర్ గా నటిస్తున్నాడు విశ్వక్ సేన్. ఈ రోజు విశ్వక్ సేన్ పుట్టినరోజుని పురస్కరించుకొని లాయర్ విశ్వామిత్ర పాత్ర గెటప్ లో ఉన్న విశ్వక్ సేన్ పోస్టర్ ని విడుదల చేశారు.
హీరోగా ‘అశోకవనంలో ….’, ‘ధమ్కీ’ వంటి సినిమాలు చేస్తూ ఇలా గెస్ట్ రోల్స్ కూడా చెయ్యడం విశేషం.
వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమాని, చైతన్య రావ్, అయేషా ఖాన్ ఈ సినిమాలో ప్రధాన తారాగణం. ‘కలర్ ఫొటో’ దర్శకుడు సందీప్ రాజ్ ఈ చిత్రానికి కథ స్క్రీన్ ప్లే మాటలు అందిస్తున్నారు. ఎస్ కేఎన్ సమర్పణలో పాకెట్ మనీ పిక్చర్స్ పతాకంపై ప్రదీప్ యాదవ్, మోహన్ యల్ల నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో గంగాధర్ దర్శకుడిగా టాలీవుడ్ లో అడుగుపెడుతున్నారు.