ఫలక్ నుమా దాస్ మళ్ళీ వస్తాడట

- Advertisement -
Vishwak Sen


‘ఫలక్ నుమా దాస్’ సినిమాకి సీక్వెల్ తీస్తాను అని అంటున్నాడు విశ్వక్ సేన్. ‘అంగమలీ డైరీస్’ అనే మలయాళ సినిమా ఆధారంగా సొంత డైరెక్షన్లో ‘ఫలక్ నుమా దాస్’ అనే తీశాడు విశ్వక్ సేన్. అందులో తనే హీరోగా నటించాడు. ఆ సినిమాతో మాస్ కి కనెక్ట్ అయ్యాడు. సినిమా విడుదలయి మూడేళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా దానికి సీక్వెల్ తీస్తానని చెప్తున్నాడు.

ప్రస్తుతం ఈ ‘మాస్ కా దాస్’ పాగల్ అనే సినిమా విడుదల కోసం వెయిట్ చేస్తున్నాడు. మరో రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. మరి, సీక్వెల్ ఎప్పుడు సెట్ చేస్తాడో?

విశ్వక్ సేన్ కి డైరెక్షన్ అంటే ఇష్టం. అందుకే, మళ్ళీ ఆ వైపు చూపు వేస్తున్నాడు. ఐతే, ‘అంగమలీ డైరీస్’ అనే సినిమాకి సీక్వెల్ రాలేదు. మరి తనే సొంతంగా ఇప్పుడు సీక్వెల్ కి కథ రాసుకోవాలి.

 

More

Related Stories