- Advertisement -

విశ్వక్ సేన్ కూడా స్పీడ్ పెంచాడు. ఈ కుర్ర హీరో ‘పాగల్’ అనే సినిమా విడుదల చేస్తున్నాడు. నెక్స్ట్ మంత్ ఒక మూవీ, ఆ తర్వాత మరోటి స్టార్ట్ చేసి వాటిని ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నాడు.
‘ఈ ఏడాది ఫస్ట్ విడుదలయ్యేది.. పాగల్. అలాగే, ‘ప్రాజెక్ట్ గామీ’ అనే మూవీ షూటింగ్ పూర్తి చేశాను. దీనికి సీజీ వర్క్ ఎక్కువ ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ కి మరో ఆరు నెలల సమయం పడుతుంది. అలాగే పివిపి బ్యానర్‌లో ఒక సినిమా చేస్తున్నా. అది ఏప్రిల్ 3నుండి షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత నిర్మాత బీవిఎస్ఎన్ ప్రసాద్‌గారితో ఒక సినిమా ఉంది. ఈ ఏడాది మూడు సినిమాలు గ్యారెంటీగా రిలీజ్ అవుతాయి,” అని విశ్వక్ సేన్ అనౌన్స్ చేశాడు.
‘ఈ నగరానికి ఏమైంది’, ‘ఫలక్ నుమా దాస్’, ‘హిట్’ సినిమాలతో విజయాలు అందుకున్నాడు విశ్వక్ సేన్.