ఐదేళ్ల కష్టం ఫలితాన్ని ఇస్తుందా?

Vishwak Sen

విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం … గామీ. ఈ సినిమా ఈ నెల 8న విడుదల కానుంది. కానీ ఈ సినిమా ఇప్పుడు మొదలైంది కాదు. 2019లో షూటింగ్ స్టార్ట్ చేశారట. “అవును ఐదేళ్ల క్రితం మొదలైంది గామీ. ‘వెళ్లిపోమాకే’ చూసి దర్శకుడు విద్యాధర్ నన్ను సంప్రదించారు అప్పటికి ‘ఈ నగరానికి ఏమైయింది’ కూడా రిలీజ్ కాలేదు. నా మీద నమ్మకంతో వచ్చారు అందుకే ఈ సినిమా ఎంత లేట్ అయినా ఆయనకు సపోర్ట్ ఇచ్చాను,” అని అంటున్నారు విశ్వక్ సేన్.

“ఈ సినిమాలో కీలకమైన అఘోర సన్నివేశాలు హైలెట్. వారణాసి కుంభమేళలో చిత్రీకరించాం. గొరిల్లా పద్దతిలో ఆ అఘోరాలతో కలిసిపోయి షూట్ చేశాం. ఈ సినిమాలో ప్రతిదీ కొత్త అనుభూతి ఇస్తుంది. ఇలా ఇప్పటివరకూ ఎవరూ తీయలేదు,” అని సినిమా గురించి చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు విశ్వక్ సేన్.

మరి ఇలాంటి సినిమాని వేరే భాషల్లో ఎందుకు విడుదల చెయ్యడం లేదు. “ప్రస్తుతం తెలుగు వరకు ప్లాన్ చేశాం. సినిమా ఫలితాన్ని బట్టి మిగతా భాషల గురించి ఆలోచిస్తాం,” అని తెలిపారు.

“త్వరలోనే “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” విడుదల అవుతుంది. ఆ తర్వాత “లైలా” అనే సినిమా మేలో మొదలౌతుంది. సుధాకర్ చెరుకూరి గారి నిర్మాణంలో ఓ సినిమా చేస్తున్నాను,” అని తన కొత్త సినిమాల గురించి చెప్పారు విశ్వక్ సేన్.

Advertisement
 

More

Related Stories