- Advertisement -

అమెజాన్, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్, ఆహా వంటి ఓటిటి వేదికలు తెలుగుసినిమాలను స్ట్రీమ్ చేస్తున్నాయి. ఇప్పుడు తెలుగులోకి సోనీ సంస్థకు చెందిన సోని లివ్ రంగంలోకి దిగింది. మొదటి సినిమాగా చిన్న చిత్రం “వివాహ భోజనంబు” సినిమాని తీసుకుంది. త్వరలోనే అందులో స్టీమ్ కానుంది. ఈ సినిమా ట్రైలర్ లేటెస్ట్ గా విడుదల అయింది.
లాక్ డౌన్ నేపథ్యంగా సాగిన కథ ఇది. కమెడియన్ సత్య మెయిన్ హీరో. అర్జావీ రాజ్ అనే కొత్త భామ హీరోయిన్ గా నటించింది. సందీప్ కిషన్ ఈ సినిమాకి నిర్మాత. అతను కూడా ఒక కీలక పాత్ర పోషించాడు.
దర్శకుడు రామ్ అబ్బరాజు తీసిన ఈ మూవీ పూర్తిగా కామెడీ చిత్రం. కరోనా సమయంలో పెళ్లి చేసుకున్న ఓ పిసినారి యువకుడి కథను వినోదాత్మకంగా చూపించారట.