అంటే.. కొత్త కథ కానే కాదు

నాని హీరోగా వస్తున్న సినిమా ‘అంటే సుందరానికి’. జూన్ 10న థియేటర్లలోకి రానుంది ఈ సినిమా. ఈ మూవీకి సంబంధించి మీడియాతో మాట్లాడాడు దర్శకుడు వివేక్ ఆత్రేయ. ఈ సందర్భంగా తన సినిమా కథలో కొత్తదనం లేదంటున్నాడు.

“అంటే సుందరానికి కథ చాలా సింపుల్. ఇదేదో కనీవినీ ఎరుగని కథ అని నేను చెప్పను. అందరికీ తెలిసిన కథే. ఇందులో ఎమోషన్స్ కూడా అఁదరికీ తెలిసినవే. కాకపోతే దాన్ని నా స్టయిల్ లో డిఫరెంట్ గా చూపించడానికి ప్రయత్నించాను. నా ప్రయత్నం అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను.”

ఇలా అంటే సుందరానికి స్టోరీలైన్ పై స్పందించాడు వివేక్ ఆత్రేయ.

Vivek Athreya

ప్రస్తుతం నాగశౌర్య చేస్తున్న ‘కృష్ణ వ్రింద విహారి’ సినిమా, ‘అంటే సుందరానికి’ సినిమా ఒకటే అనే కామెంట్స్ పై కూడా వివేక్ ఆత్రేయ స్పందించాడు. ఈ రెండు సినిమాల్లో హీరో పాత్రలు ఒకటే. ఇద్దరూ బ్రాహ్మణ కుర్రాడి పాత్రల్లోనే కనిపించారు. అంతకుమించి ఈ రెండు సినిమాల మధ్య సారూప్యం లేదంటున్నాడు వివేక్.

 

More

Related Stories