మహేష్ ఫోన్ కాల్ మిస్సయిన వైజాగ్ ప్రేక్షకులు

మేజర్ సినిమా ప్రీమియర్ వైజాగ్ లో గ్రాండ్ గా జరిగింది. అందరికీ ఫ్రీగా షో చూపించాడు అడివి శేష్. షో పూర్తయిన తర్వాత జరిగిన ప్రెస్ మీట్ లో తను అందుకున్న నేషనల్ సెక్యూరిటీ బ్లాక్ కమాండో మెడల్ ను కూడా గర్వంగా చూపించారు. ప్రీమియర్ సూపర్ సక్సెస్ అయింది. మంచి రెస్పాన్స్ రాబట్టుకుంది. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో మహేష్ ఫోన్ కాల్ మిస్సయ్యారు వైజాగ్ ఆడియన్స్.

ప్రీమియర్ తర్వాత దర్శకుడు శశికిరణ్ తిక్క మాట్లాడుతూ.. వైజాగ్ లో ప్రీమియర్స్ గురించి యూరోప్ లో ఉన్న మహేష్ కు అప్ డేట్ ఇచ్చామని, వైజాగ్ షో అనగానే మహేష్ చాలా ఎక్సయిట్ అయినట్టు చెప్పుకొచ్చాడు. టైమ్ తో సంబంధం లేకుండా ప్రీమియర్ పూర్తయిన వెంటనే ఫోన్ చేసి ఫీడ్ బ్యాక్ చెప్పాలని కోరారట.

ఈ విషయాన్ని శశికిరణ్ చెప్పగానే, థియేటర్ లో ఆడియన్స్ అంతా గోల మొదలుపెట్టారు. మహేష్ కు ఫోన్ చేయాలని డిమాండ్ చేశారు. శశికిరణ్ కూడా అంతే ఉత్సాహంగా ఫోన్ తీశాడు. పక్కనే ఉన్న అడివి శేష్, ఆ ఫోన్ నుంచి మహేష్ కు వాట్సాప్ కాల్ చేశాడు. కానీ ఫోన్ కనెక్ట్ కాలేదు. ఆ ఫోన్ కనెక్ట్ అయి ఉంటే, మహేష్ ఫోన్ లోనే వైజాగ్ ఆడియన్స్ తో మాట్లాడేవాడు. ఆడియన్స్ రెస్పాన్స్ వినేవాడు. అలా ఓ అరుదైన ఘటనను వైజాగ్ ఆడియన్స్ మిస్సయ్యారు.

 

More

Related Stories